మల్కాజ్‌గిరిలో మళ్లీ గెలిచే సత్తా రేవంత్ కు ఉందా? : ఎమ్మెల్యే గువ్వల
మల్కాజ్‌గిరిలో మళ్లీ గెలిచే సత్తా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికు ఉందా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడులా మాట్లాడడం లేదని, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునే బ్రోకర్లా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల వల్ల పాలమూరుకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? అని ప్రశ్నించారు. కొండగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిన రేవంత్ గతం మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంపై మాట్లాడేందుకు రేవంత్ గజగజ ఓనికిపోతున్నారని, వ్యాపారాలు చేసుకునేందుకు పీసీసీ పదవిని వాడుకుంటున్నారని విమర్శించారు. రేవంత్‌కు దైర్యం ఉంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎస్సీలు, సీఎంపై రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.













