ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు … ఆరోపణలు రుజువు చేస్తే
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చేరులో జరిగిన టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవితంలో ఒక్క గజం స్థలం కబ్జా చేసినట్లు రుజువు చేస్తే పటాన్చెరు పోలీస్ స్టేషన్ వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం అని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హయాంలో పటాన్చేరు నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నందీశ్వర్ గౌడ్ నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. నాపై ఆరోపణలను ఆధారాలతో రుజువు చేయాలని డిమాండ్ చేశారు.













