బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజల పక్షాన, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా భిక్షమయ్యగౌడ్ బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా చాలా మంది నేతలు బీజేపీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కుటుంబపాలన, అరాచక పాలన అంతం చేయాలన్నదే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట తప్పుదోవ పట్టించేదిగా ఉందని విమర్శించారు. సీఎం ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా, ఎదురు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.













