పూర్తి ఆనందోత్సాహాలతో కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడంతో పాటుగా వినూత్నంగా వార్షికోత్సవాన్ని వేడుక చేసుకున్న ప్రీమియా అకాడమీ
ప్రీమియా అకాడమీ యొక్క ప్రీ ప్రైమరీ విభాగం 2022–23 విద్యా సంవత్సరానికిగానూ కిండర్‌గార్టెన్ బ్యాచ్ విద్యార్ధుల గ్రాడ్యుయేషన్‌ను అత్యంత ఆనందోత్సాహాలతో నిర్వహించింది. యువ అభ్యాసకులు తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం చూపుతూ పాటలను ప్రదర్శించడంతో పాటుగా భాషపై తమకున్న పట్టును సైతం ప్రదర్శించడం ద్వారా వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలను కలిగించారు. ప్రతి చిన్నారి తమ వ్యక్తిగత వ్యక్తిత్వంను తమ భావోద్వేగాలు, సహకార స్ఫూర్తి ద్వారా ప్రదర్శించారు. తమను పూర్తిగా ఆరాధించేలా చేసుకున్నారు.
ఈ గ్రాడ్యుయేషన్ వేడుకలను అనుసరించి ప్రీమియా స్కూల్ వార్షికోత్సవ వేడుక ‘విల్లీ వొంకా 2.0’ జరిగింది. ఈ పాఠశాలకు ఈ నేపథ్యం వినూత్నమైనది. అత్యంత సుప్రసిద్ధమైన క్యారెక్టర్లు అయిన చోటాభీమ్, కాస్పెర్, లయన్ కింగ్, సిండ్రెల్లా మరియు మరెన్నో ఆసక్తికరమైన క్యారెక్టర్లను మిళితం చేస్తుంది. ఈ వినూత్నమైన నేపథ్యం రైజ్ లక్షణాలను ఈ పాఠశాలలో అభ్యాసకులలో నింపింది. యువ అభ్యాసకులు తమ పనితీరు సామర్ధ్యాలను అన్వేషించడంతో పాటుగా అత్యద్భుతమైన రీతిలో పాట, నృత్యం, సంగీతం ప్రదర్శించడం ద్వారా ప్రదర్శించారు. ఈ మొత్తం కార్యక్రమం అత్యంత అందంగా ముందుకు రావడంతో పాటుగా వీక్షకులను పూర్తిగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
ప్రీమియా అకాడమీ తమ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌ను అభినందించింది మరియు తమ అభ్యాసకుల పట్ల గర్వంగానూ భావించింది. ఈ పాఠశాల ఎప్పటిలాగానే రాబోయే విద్యా సంవత్సరం కోసం ఆసక్తిగా చూస్తోంది. ప్రీమియా అకాడమీ యువ అభ్యాసకులకు పూర్తి అంకిత భావంతో విద్యాబోధన చేయడంతో పాటుగా వారి భవిష్యత్‌ను అత్యుత్తమ విద్యతో తీర్చిదిద్దుతుంది.
ఈ సందర్భంగా ప్రీమియా అకాడమీ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సింధూరి రెడ్డి మాట్లాడుతూ ‘‘మా కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ డే రోజున విల్లీ వోంకా 2.0 నేపథ్యం తీసుకోవడమనేది ప్రీమియా అకాడమీ వద్ద అనుసరిస్తున్న మహోన్నత విలువలను ఖచ్చితంగా ప్రదర్శిస్తుంది. మా అభ్యాసకులు వారి ఆత్మవిశ్వాసం, ప్రతిభ, భాగస్వామ్య స్ఫూర్తిని వేదికపై ప్రదర్శిస్తూనే తమ వినూత్నమైన వ్యక్తిత్వాలను సైతం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్తమ విద్యకు మేము కట్టుబడి ఉన్నాము మరియు మా అభ్యాసకులను అంకిత భావంతో తీర్చిదిద్దనున్నాము’’ అని అన్నారు.
ప్రీమియా అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీ తృప్తి రావు మాట్లాడుతూ ‘‘ మా ప్రీమియా అకాడమీ కిండర్‌గార్టెన్ వద్ద మరో విజయవంతమైన అభ్యాస సంవత్సరం, వృద్ధిని వేడుక చేసుకుంటుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా విద్యార్థులు ఈ సంవత్సరం ఎంతో సాధించారు. వారు ఎదిగిన తీరు, వారున్న స్ధానం పట్ల మేము గర్విస్తున్నాము. ఈ కార్యక్రమం మేము వారి విజయాలను వేడుక చేసుకోవడానికి, మా ఉపాధ్యాయుల కృషిని గుర్తించడానికి ఒక మార్గం’’ అని అన్నారు.













