Messi: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. మీడియాకు నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మ్యాచ్ కవరేజ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం సమయంలో మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో, పోలీసులు, జర్నలిస్టుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వద్ద ఎంట్రీ పాస్లు ఉన్నప్పటికీ లోపలికి పంపించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత ప్రియాంక గాంధీ, మెస్సీ స్టేడియానికి చేరుకున్నారు. మెస్సీ నినాదాలతో ఉప్పల్ స్టేడియం హోరెత్తుతోంది.
మెస్సీ ఇవాళ్టి షెడ్యూల్:
7:50 PM: ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం.
8:06 PM: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ మైదానంలోకి ప్రవేశం.
8:18 PM: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైదానంలోకి చేరుకుంటారు.






