తెలుగు టైమ్స్ న్యూస్ ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా!
తెలుగు టైమ్స్ NRI తెలుగు కమ్యూనిటీ కి ఏమి కావాలో తెలుసుకొని ఎడిటోరియల్ కంటెంట్ పోలసీ ఏర్పాటు చేసుకుంది. అయితే తెలుగు కమ్యూనిటీ లో, తెలుగు సంఘాల లో యాక్టిివ్ గా వుండే కొందరు తెలుగు వారికి తెలుగు చదవడం రాదు. అలాంటివారు తెలుగు టైమ్స్ ని ఇంగ్లీష్ లో ఇవ్వమని అడుగుతూ ఉంటారు.
తెలుగుటైమ్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు పాఠకుల కోరిక మేరకు ఇంగ్లీష్ లో వార్తలను తెలుగు టైమ్స్ ఇవ్వనున్నది. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ ఇంగ్లీష్ వెర్షన్ ను తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు ప్రారంభించారు.
అమెరికాలోని తెలుగు ఎన్నారైలకు గత 20 సంవత్సరాలుగా తెలుగులో వారి సమాచారాన్ని అందిస్తున్నట్లుగానే ఇంగ్లీష్ లో కూడా వార్తలను అందిస్తామని సుబ్బారావు తెలిపారు. అమెరికాలోని నేటితరానికి తెలుగు రాష్ట్రాల పరిణామాలను, వార్తలను ఇంగ్లీష్ లో ఇస్తే బావుంటుందన్న ఉద్దేశ్యంతో ఇంగ్లీష్ వెర్షన్ ను ప్రారంభించినట్లు చెప్పారు.
తెలుగు టైమ్స్ ePaper గా, పోర్టల్ గా ఎక్కువ మంది కి చేరుతున్న ప్రస్తుత పరిస్థితులలో, పోర్టల్ లో ఇంగ్లీష్ వెర్షన్ కూడా ప్రారంభం అవుతుంది అని, క్రమంగా రెండు సెక్షన్లు పూర్తి స్థాయి లో వుంటాయని, మరింత మంది పాఠకులను, అభిమానులను తెలుగు టైమ్స్ కి తెచ్చి పెడతాయి అని సుబ్బా రావు తెలిపారు.
Telugu Times Website English Link :
https://telugutimes.net/lang/eng













