వింగ్స్ ఇండియా-2020కి తెలంగాణ ఆతిథ్యం
ఢిల్లీలో జరగనున్న వింగ్స్ ఇండియా సన్నాహక సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 12 నుంచి 15 వరకు బేగంపేట ఎయిర్పోర్టు వింగ్స్ ఇండియా-2020 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశంలో ఢిల్లీలో జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరు కావాలని ఆహ్వానించిన మేరకు కేటీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొనున్నారు. దేశ మైవానికి రంగంలో అత్యంత కీలకమైన ఈకార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహిస్తుండడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వింగ్స్ ఇండియా సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు.
ఈ సదస్సుకు ఎయిర్లైన్స్, విమాన తయారీ సంస్థలు, కార్గో, స్పేస్ ఇండస్ట్రీ ప్రతినిధులు, అనుబంధ రంగాల్లో పెట్టుబడిదారులు, వైమానిక రంగ నిపుణులు, ఉన్నతాధికారులు, దేశ, విదేశాల నుంచి తరలిరానున్నారు.













