స్వదేశానికి తెలంగాణ ప్రవాసీయులు
షార్జాలోని సౌద్ పార్కులో ఉంటూ స్వదేశానికి వెళ్లేందుకు నిరీక్షిస్తున్న 11 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రవాసీయులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. వెంటనే దుబాయ్, షార్జాలోని తన అనుచరులకు ఫోన్ చేసి, దీన స్థితిలో ఉన్న తెలంగాణ ప్రవాసీయులకు సాయం అందించాలని కోరారు. వారికి భోజన వసతి కల్పించడంతో పాటు స్వదేశానికి రావడానికి అవసరమైన విమాన టికెట్లు సమకూర్చేందుకు రమణ ముందుకొచ్చారు. శుక్రవారం ఉదయం దుబాయి నుంచి హైద్రబాద్కు వెళ్లడానికి వీరికి విమాన టికెట్లను కూడా అందజేశారు. మానవతా దృక్ఫథంతో తమను ఆదుకున్న రమణకు వీరు కృతజ్ఞతలు తెలిపారు. ఉచితంగా టికెట్లు ఇస్తున్నారని తెలియడంతో మరికొంత మంది అభ్యర్థులు కూడా పార్కుకు చేరుకున్నారు. ప్రస్తుం వీరి సంఖ్య 25 దాటింది.













