తెలంగాణలో నిపా వైరస్?
నిఫా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో కేరళలో 12 మంది మృత్యువాతపడగా, 25 మంది ఈ వ్యాధి బారిన పడినట్టు కేరళ ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు కర్ణాటకలో కూడా ఇద్దరికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యాయరు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా పలు చర్యలను చేపట్టింది. విమానాశ్రయం, రైల్వే సేష్టన్లలో కేరళ నుంచి వచ్చే వారిలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించిన వారు నుంచి శాంపిల్ సేకరించామని ప్రస్తుతం ఇప్పటివరకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఎవరినీ గుర్తించలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరు మాములుగా అస్వస్థతకు గురికావడంతో ఇక్కడకు చేర్పించినట్టు వైద్యులు పేర్కొంటుండగా, కొందరు మాత్రం భయ బ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని వైద్యు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.













