శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి
శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి నియామకం అయ్యారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఆయన ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్‌ను గవర్నర్ నియమించారు. శాసన మండలి చైర్మన్‌ను ఎన్నుకునే వరకూ భూపాల్ రెడ్డి ప్రొటెం చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీ కాలం గురువారంతో పూర్తైంది. మొత్తం 6 గురు ఎమ్మెల్సీల పదవీ కాలం గురువారంతో ముగిసింది. కోవిడ్ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచో గుత్తా సుఖేందర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆయనకు శాసన మండలి చైర్మన్‌గా అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డిని మరోసారి మండలి చైర్మన్‌గా రెన్యువల్ చేస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.













