తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భావం
తెలంగాణ జనసమితి పార్టీ పేరును టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేడు అధికారికంగా ప్రకటించారు. 4న జెండా ఆవిష్కరణ చేస్తామని ఆయన తెలిపారు. 5 నుంచి సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 29న హైదరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయనున్నట్లు కోదండరాం వెల్లడించారు. చాలా ఆలోచించాకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అమరుల ఆశయాలు నెరవేరలేదన్నారు. మంత్రుల ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి శాఖల సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి ధర్మదర్శనం లేదన్నారు. ఇన్ని రోజులు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ ఉండరని విమర్శించారు. జనసమితిలో చేరడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారని ఈ సందర్భంగా కోదండరాం తెలిపారు.













