తెలంగాణ ప్రభుత్వం శుభవార్త …ఉద్యోగులకు, పెన్షనర్లకు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు,పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్ష్ పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంచింది. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు డైవర్లకు అదనంగా రూ.150 చెల్లించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30 శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ.2000 నుంచి రూ.3000 పెంచింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.6 లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. మోటార్ సైకిళ్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ.4 లక్షలు , కుమారుడికి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75 వేల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30 శాతం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది.













