రూ.1,46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగతాయని కేసీఆర్ సృష్టం చేశారు.
కేటాయింపులు :
2019-20 ఏడాది ప్రతిపాదిత వ్యయం రూ.1,46,492 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు
మూలధన వ్యయం రూ.17,274 కోట్లు
మిగులు బడ్జెట్ అంచనా రూ.2,044 కోట్లు
ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలు రూ.1,82,017 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.9,402 కోట్లు
గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు
మునిసిపాలిటీలకు రూ.1,764 కోట్లు
విద్యుత్ సబ్సిడీలకు రూ.8 వేల కోట్లు
రైతు రుణాల మాఫీకి రూ. 6 వేల కోట్లు
రైతుబంధుకు రూ.12 వేల కోట్లు
రైతు భీమ కోసం రూ.1125 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.1,336 కోట్లు













