భారత్ కే కాదు.. ఉక్రెయిన్‌కి కూడా కేసీఆర్ ప్రధాని
ప్రశాంత్ కిషోర్‌లు బీజేపీకి అవసరం లేదని ఆ పార్టీ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్త ఒక పీకేతో సమావేశమయ్యారు. భారతదేశానికే కాదు, ఉక్రెయిన్‌కి కూడా కేసీఆర్ ప్రధాని అవుతారని సెటైర్లు వేశారు. తెలంగాణను వదిలేసి, కేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్లా తిరుగుతున్నాడని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎంతో సమావేశం అయినంత మాత్రాన కేసీఆర్ బీజేపీని ఏమీ చేయలేరన్నారు. తమ అవినీతిని దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందని ప్రశాంత్ కిషోర్ ఏమీ చేయలేరన్నారు. యుద్ధం కేసీఆర్, బీజేపీ మధ్య కాదని తెలంగాణను కాపాడేందుకే మా పోరాటమని తెలిపారు.













