బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లీక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రేమయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద నిరసనకు దిగారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. దీనికి నిరసనగా జనగామ జిల్లా స్టెషన్ఘన్పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తల తీవ్ర ప్రతిఘటనల మధ్య సంజయ్‌ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. మార్గం మధ్యలో పోలీసు వాహనాలను కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలగించారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అరెస్ట్ చేసిన అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.













