ఎమ్మెల్సీగా తాత మధుసూదన్ ప్రమాణ స్వీకారం
ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, భాస్కర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అరికెపుడి గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, రాష్ట్ర లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు.













