సాలు దొర.. సెలవు దొర వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై సాలు దొర సెలవు దొర వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యాందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించినా, కేసీఆర్ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అలీబాబా 40 దొంగల తీరుగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు.
సీఎం కేసీఆర్ గద్దె దిగు బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని నిత్యం గుర్తు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి బండి సంజయ్ చేపట్టే ప్రజా సంగ్రామ యాత్ర వెళ్తుందన్నారు. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.













