కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం
హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఆరోపించారు. హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటలకు మద్దతుగా తరుణ్ చుగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ మెనిఫెస్టో విడుదల చేశారు. అనంతరం తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజలకు కేసీఆర్ కుటుంబం అవమానించిందన్నారు. హుజురాబాద్‌లో కుక్కను పెట్టినా గెలుస్తామని టీఆర్ఎస్ నాయకులు అన్నారని అన్నారు. రాచరిక, దోపిడీ, అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టలని పిలుపునిచ్చారు. ధనవంతుల కోసం మాత్రమే టీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు. అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య ఉప ఎన్నిక జరుగుతోందని అన్నారు. హుజూరాబాద్‌లో విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజాం కాలాన్ని తలపిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఈటలను గెలిపించి కేసీఆర్ అహంకారాన్ని అణచాలని తరుణ్ వ్యాఖ్యానించారు.













