ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మేము 80 స్థానాలు గెలుస్తాం
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఢిల్లీలో షాక్ తగిలిందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్కు 60 మంది అభ్యర్థులు కూడా దొరకరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి 25 మంది నేతలు టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే తమ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయమన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని, చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదన్నారు.













