దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 16. నామినేషన్లను 17న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో నేటి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిద్దమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా నోటిఫికేషన్ రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు.













