వ్యాపారరంగంలో బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలు ప్రతిభను కనబరచాలి
బ్రాహ్మణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారరంగంలో తమ ప్రతిభను కనబరచాలని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ కేవీ రమణాచారి ఆకాంక్షించారు. మంగళవారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనరేట్‌లో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం 99 మంది ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలకు రూ.4.42 కోట్ల ఆర్థికసాయం మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, గోపాలశర్మజోషి, ఎం వెంకటరమణశర్మ, తెలంగాణ పత్రిక సంపాదకుడు అష్టకాల రామ్మోహన్, చకిలం అనిల్‌కుమార్, సువర్ణసులోచన, సుమలతాశర్మ, హనుమంతాచారి పాల్గొన్నారు.













