షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఆరిపోయే దీపం
ఎన్నికల అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుందని చెబుతున్నాయన్నారు. దొరల పాలన వద్దని ప్రజలు భావించి ఓటేశారని అన్నారు. బీఆర్ఎస్ ఆరిపోయే దీపం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు ఈసారి పట్టం కట్టారని తెలుస్తుందన్నారు. దీపం ఆరిపోయే ముందు వెలిగినట్టుగ ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని కేటీఆర్ అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాదు అర్బన్‌లో మెజారిటీ కాంగ్రెస్‌కు కనివినీ ఎరుగని రీతిలో వస్తుందని తెలిపారు. తనకు మెజారిటీ, మైనారిటీ అనే భావన లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.













