ఏజీ వర్సిటీని సందర్శించిన అమెరికా ఎంబసీ సైంటిస్ట్

అమెరికా ఎంబసీలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సీనియర్ అగ్రికల్చర్ సైంటిస్ డాక్టర్ సంతోష్‌కుమార్ సింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సాగు పద్ధతులు, విశ్వవిద్యాలయం చేస్తున్న బోధన, బోధన విస్తరణ తదితర అంశాలపై గురించి చర్చించారు. వాతావరణ మార్పులు ప్రభావాలను అధిగమిచడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, రూపొందించాల్సిన ప్రణాళికలు ఇతర అంశాలపై చర్చించారు.