ఆ కార్డు చెల్లదు మహిళలకు .. సజ్జనార్ విజ్ఞప్తి
ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరని స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని, అలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఓ ఒరిజినల్ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అయితే పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటా కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకొని ప్రయాణించాలన్నారు.













