డా.ఎస్.కె.జోషి ఆధ్వర్యంలో సచివాలయంలో రాష్ట్రస్ధాయి శిక్షణా సంస్ధలపై సమీక్ష
రాష్ట్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్రస్ధాయి శిక్షణా సంస్ధలు, అకాడమీలు మరింత సమన్వయంతో పనిచేయడంతో పాటు ఆయా సంస్ధలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను ఇతర సంస్ధలలో అమలు చేసేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు.
గురువారం సచివాలయంలో రాష్ట్రస్ధాయి శిక్షణా సంస్ధలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్, రాజీవ్ త్రివేది, వికాస్ రాజ్, డైరెక్టర్ తెలంగాణ పోలీస్ అకాడమీ సంతోష్ మెహ్రా, ఫైర్ సర్వీసెస్ డి.జి గోపికృష్ణ, పిసిసిఎఫ్ పి.కె.ఝా, EPTRI D.G. కళ్యాణ్ చక్రవర్తి, వైద్య అధికారులు అల్లువర్శిని లతో పాటు MCRHRD, NAC, ఫారెస్ట్ అకాడమీ, TASK, తదితర సంస్ధల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ సంతోష్ మెహ్రా ఛైర్మన్ గా, తిరుపతయ్య కన్వీనర్ గా MCRHRD, తెలంగాణ పోలీస్ అకాడమీ, EPTRI, ఫారెస్టు, వైద్య అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుపుతూ, నెలలోగా నివేధిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కమిటి శిక్షణా క్యాలెండర్, రాష్ట్రస్ధాయి ట్రైనింగ్ గైడ్ లెన్స్, శిక్షణా ద్వారా అదనపు నిధుల సమీకరణ, కేంద్ర శిక్షణ సంస్ధలతో సమన్వయం, సర్వీసు రూల్స్ లో Training Modules కు సంబంధించిన సూచనలు, వివిధ రాష్ట్రస్ధాయి శిక్షణా సంస్ధల మధ్య సమన్వయం, వనరుల సద్వినియోగం, సామాజిక భాద్యతగా సాధారణ పౌరులకు ఫైర్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, జిల్లా స్ధాయిలో శిక్షణా సంస్ధ గుర్తింపు లాంటి అంశాలపై నివేధిక సమర్పిస్తుందని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు అమలుచేయాలన్నారు. వివిధ శిక్షణా సంస్ధలలో సౌర విద్యుత్ వినియోగం, జీరో వేస్ట్ డిశ్టార్జ్, ఫ్యాకల్టీ వినియోగంపై చర్చించారు.
రాష్ట్ర స్ధాయి శిక్షణా సంస్ధలను సమర్ధంగా వినియోగించుకోనేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. ఫైర్ సేఫ్టీ, RTI, హెల్త్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ లాంటి అంశాలపై చర్చించారు. MCRHRD, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, EPTRI, CGG, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ TASK, తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, NAC తదితర సంస్ధలు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాల వివరాలను అధికారులు సి.యస్ కు వివరించారు. సాధారణ ప్రజలు ప్రభుత్వ సేవలకు ఐటి ని వినియోగించుకునేలా శిక్షణనిచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. GST పై శిక్షణ, సైబర్ క్రైం, అర్బన్ ఫైనాన్స్, ప్రభుత్వ పనులకు ఏజెన్సీల గుర్తింపు లాంటి అంశాలపై అధికారులు చర్చించారు.
————————————————————————————————————————–
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం













