తాజాలకు భద్రత.. మాజీలకు తొలగింపు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రత తొలగిస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఉన్న గన్మెన్లను తొలగించి వారిని ఆయా ప్రాంతాలలోని ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇటీవల కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలకు, మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారి భద్రత నిమిత్తం గన్మెన్లను కేటాయించారు. కాగా ఇటీవల ఎన్నికలలో గెలిచిన వారిలో ఎవరికి ఎంత భద్రత అవసరమన్న విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక సమర్పించాలని సర్కారు పోలీసు శాఖకు ఇచ్చిన ఆదేశాలలో పేర్కొంది.













