డిసెంబర్ లో తెలంగాణలో మరో అద్భుతం
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రకటనతో 2009 డిసెంబర్ 9 నాడే ఒక అద్భుతం జరిగింది. రాబోయే డిసెంబర్లో తెలంగాణలో మరో అద్భుతం జరుగబోతోందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే కాంగ్రెస్ ఆ ఆరు గ్యారంటీలు ప్రకటించిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుంది. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టిపీడిస్తోంది. రాష్ట్ర సచివాలయ నిర్మాణంలో దోపిడీ జరిగింది. తెలంగాణలో ప్రజా ధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకోంది. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో సంపద పెంచాలి. పేదలకు పంచాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది అని అన్నారు.













