కొడంగల్ కు కేసీఆర్ రాకపోతే.. కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం
అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తానైనా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ అదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌ను చిత్తుగా ఓడిరచేందుకు సిద్ధంగా ఉన్నాం. కొండగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించా. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్ రాకపోతే కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం అని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదని, తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదన్నారు. రెండిరట మూడో వంతు మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.













