కర్ణాటకలో లక్ష 20 వేలు.. కొడంగల్ లో అంతకంటే ఎక్కువ
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి లక్ష 20 వేల మెజారిటీ వచ్చిందని, కొండగల్‌లో అంతకంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందన్నారు. కొడంగల్‌లో గతంలో బీఆర్ఎస్ను గెలిపించినా అభివృద్ధి జరగలేదు. కొడంగల్‌లో పోటీ చేయాలని కేసీఆర్, కేటీఆర్‌కు సవాల్ విసిరాను. నాకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాకోసం కాదు.. మీకోసమే అన్నారు. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా? కొడంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుంది. కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు అన్నారు. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయి అని అన్నారు.













