కేసీఆర్కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక సభలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపించారు. ‘మాట్లాడితే నేను బక్కోడిని అని కేసీఆర్ చెప్తాడు. ఆయన బక్కోడు కాదు.. భూబకాసురుడు. ఫాంహౌస్లో పడుకునే కుంభకర్ణుడు. లక్షకోట్లు దోచుకున్న పెద్ద దొంగ’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాలను కేసీఆర్ కబ్జా చేశాడని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేసీఆర్కు చర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని ఎద్దేవా చేశారు. దుబ్బాకకు రావలసిన నిధులను కూడా మంత్రి హరీశ్ రావు దారి మళ్లిస్తున్నాడని, వాటిని సిద్ధిపేటకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. అలాగే సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే కూడా కేంద్ర నిధులు తీసుకొస్తానని చెప్పి, ఏమీ చేయలేకపోయాడన్నారు.













