తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్
తెలంగాణ రాష్ట్రంలో మరో నెలరోజులపాటు లాక్డౌన్ పొగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనేవారికి కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దవాఖానలు, మందుల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయలు రాత్రి 9:30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని పేర్కొంది.













