జగన్ కు… చంద్రబాబుతో పోలికా ?
ఆర్థిక నేరస్థుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టాలని మాట్లాడిన వైఎస్ జగన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హుందాగా కనిపిస్తున్నాడా? అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావు చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో రావుల మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో తెలంగాణ నిధులను మింగిన జగన్ మీకు ఎలా సన్నిహితుడయ్యారు? జగన్‌తో టీఆర్ఎస్కు ఉన్న భావసారూప్యత ఏమిటి? అని నిలదీశారు. జగన్ హుందాగా ప్రవర్తిసున్నారని కేటీఆర్ అనడం చూస్తే హుందాతనం నిర్వచనాన్నే మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.













