చంద్రబాబు లేఖలతో తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఆగింది?
చంద్రబాబు ఉత్తరాల వల్ల తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఆగిందో మంత్రి హరీశ్ రావు చెప్పాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరకు పార్టీ సమావేశం కూడా తన ఫామ్ హౌస్‌లోనే పెట్టారని, తద్వారా ఫాంహౌస్ నుంచే పాలన చేస్తారని చెప్పకనే చెప్పారని విమర్శించారు. టీఆర్ఎస్కు అధికారం ఎందుకు ఇవ్వకూడదో హరిశ్‌రావుకు వంద ప్రశ్నలు వేస్తామన్నారు. ప్రతిపక్షాలను కలుపుకొని పోతమంటూ ఇతర పార్టీల ఎమ్మెల్యేను కేసీఆర్ కలుపుకొని పోయారని ఎద్దేవా చేశారు. కనీస ఉమ్మడి ప్రణాళికను రేపు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రణాళికలో ప్రతి పౌరుడి సమస్యలనూ ప్రతిపాదించినట్టు చెప్పారు. కేసీఆర్ ఓట్ల కౌంటింగ్ కంటే ముందే నైతికంగా ఓడిపోయారన్నారు. చేసింది చెప్పుకొనే స్థాయిలో లేకపోవడం వల్లే అవసరంగా చంద్రబాబును తిడుతున్నారని మండిపడ్డారు.













