పెండింగ్ బిల్లుల అంశంపై.. రాజ్‌భవన్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల అంశంపై గత కొంత కాలంగా ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్ బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై గత కొన్నిరోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ పెండింగ్ బిల్లుల అంశంపై రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని స్పష్టం చేసింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్ ఆమోదించారని వెల్లడించింది. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు పేర్కొంది.













