ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాక్ ఇచ్చిన బీజేపీ
మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నువూర్ శర్మ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాడానికి బీజేపీ పది రోజులు గడువిచ్చింది. సెప్టెంబర్ 2లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.













