త్వరలో హైదరాబాద్ లోనూ ఖతార్ వీసా కేంద్రం
త్వరలోనే హైదరాబాద్ నగరంలోనూ ఖతార్ వీసా కేంద్రం ప్రారంభంకానుంది. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటి వీసా కేంద్రాన్ని ఇటీవల ఢిల్లీలో ప్రారంభించారు. తర్వాత ముంబయిలోనూ నెలకొల్పారు. ఇకముందు హైదరాబాద్‌తో పాటు కోచి, చెన్నై, లఖ్‌నపూ, కోల్‌కతాల్లో కూడా వీసా కేంద్రాలను ప్రారంభించనున్నారు. వీసా మీద ఖతార్ వెళ్లేవారి పని ఒప్పందాలను డిజిటలీకరణ చేస్తారు. దీంతో వైద్యపరీక్షలు, బయోమెట్రిక్ నమోదు వంటి సేవలన్నీ ఒకేచోట లభ్యమవుతాయి. దరఖాస్తుదారులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వీసా విధానం పూర్తయిన తర్వాత దరఖాస్తు పని ఎంతవరకు వచ్చిందో ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.













