ప్రధానితో పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ
తమిళనాడు సంస్థాగత వ్యవహారాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించానని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాను పొంగులేటి కలిశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇండియా పేరుతో ఏర్పడ్డ కూటమికి సీఐఎ (కరప్షన్ ఇంక్లూసివ్ అలయన్స్) అని పేరు పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో నా భూమి, నా ప్రజలు పేరుతో జూలై 28 నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని సుధాకర్ రెడ్డి తెలిపారు. జులై 29న జరిగే ఖమ్మం సభ గురించి కూడా అమిత్ షాతో మాట్లాడానని తెలిపారు.













