పధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 8న ప్రధాని హైదరాబాద్ రానున్నారని బీజేపీ వర్గాలకు సమాచారం అందింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రధాని పాల్గొంటాంరని తెలుస్తోంది. ఏప్రిల్ 8న రూ.700 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుపతి-సికింద్రాబాద్ మధ్యన వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఆధునీకరణ పనుల శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే అనివార్యకారణాలతో ఆ పర్యటన వాయిదా పడిరది. దాంతో వర్చువల్‌గా సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించారు. తాజాగా సికింద్రాబాద్`తిరుపతి మార్గంలో నడిచే వందే భారత్ రైలుకు ప్రధాని మోదీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు.













