తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటన ఖరారైనట్లు తెలిసింది. మోదీ ఏప్రిల్ 8న రాష్ట్రానికి రానున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సికింద్రబాబాద్`తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారని, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని తెలిపాయి. శంకుస్థాపన కార్యక్రమం గతంలో రెండుసార్లు వాయిదా పడడం తో దీనిని అధికారికంగా ప్రకటించే విషయంలో రైల్వే, ఇతర అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. పార్టీ నేతలు మాత్రం మోదీ కార్యక్రమం ఖరారైనట్టే చెబుతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగిస్తారని అంటున్నారు. సభకు ఏర్పాట్లు, ప్రధాని పర్యటన విజయవంతం చేయడంపై అంతర్గతంగా పార్టీలో కసరత్తు సాగుతోంది. ఇటీవల ఢల్లీిలో జరిగిన సమావేశంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేస్తామనే ధీమాను మోదీ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని, అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడిరదని రాష్ట్ర ముఖ్య నేతలు చెబుతున్నారు.













