పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధు అరెస్ట్

పెద్దపల్లి జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పుట్ట మధును పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లాయర్ దంపతుల హత్య కేసులో ముద్దాయిగా ఉన్న పుట్ట మధును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. గత వారం రోజులుగా పుట్ట మధు అదృశ్యమైన సంగతి తెలిసిందే. భీమవరంలో పుట్ట మధును అరెస్టు చేసిన పోలీసులు పెద్దజిల్లా తీసుకొచ్చారు. గత వారం రోజులుగా పుట్ట మధు కనిపించడకపోవడంపై కారణాలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వామన్‍రావు హత్య కేసులో ఇప్పటికే ఒకసారి మధును విచారించిన పోలీసులు, వామన్‍రావు తండ్రి ఫిర్యాదుతో మరోసారి విచారణ చేపట్టారు.