17 నుంచి పాస్‍పోర్ట్ సేవలు..

రీజినల్ పాస్‍పోర్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ పాస్‍పోర్ట్ సేవా కేంద్రాల (పీవోపీఎస్‍కే) సేవలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ వరకు రద్దు చేసింది. మే 17వ తేదీ నుంచి అపాయింట్‍మెంట్ బుక్ చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తామని పేర్కొన్నది. అన్ని కేంద్రాల్లో అపాయింట్‍మెంట్ స్లాట్‍లను 50 శాతం తగ్గించింది. పాస్‍పోర్ట్ అపాయింట్‍మెంట్ స్లాట్‍ను తగ్గించిన నేపథ్యంలో వెయిటింగ్ పీరియడ్ ఒక్కరోజు కాకుండా రెండు లేదా మూడు రోజులు ఉంటుందని చెప్పింది. అన్ని కేంద్రాల్లో ఇకపై బేగంపేటలో రోజూ 410, అమీర్‍పేటలో 320, టౌలీచౌకీలో 350, నిజామాబాద్‍లో 100 దరఖాస్తులను మాత్రమే పరిశీలించనున్నది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఎవరికైనా కొవిడ్ 19 లక్షణాలు ఉంటే వారి అపాయింట్‍మెంట్‍ను రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పాస్‍పోర్టు రీజినల్ ఆఫీసర్ దాసరి బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు.