అమెరికా నుంచి ఆన్‍లైన్‍లో ఫిర్యాదు.. ఒకేరోజులో

అమెరికాలో ఉంటున్న ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.20 లక్షలు కాజేసిన వైనంపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‍లోని అంబర్‍పేటకు చెందిన శ్రీనివాసమూర్తి గత కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతా నుంచి రూ.20 లక్షలు లూటీ చేశారు. దీంతో బాధితుడు శ్రీనివాసమూర్తి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఆన్‍లైన్‍లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.