యూఎస్ వెళ్లే ఆరుగురిలో ఒకరు ఇండియన్
అమెరికాకు వెళ్లే ప్రతి ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయులేనని, ఉన్నతవిద్య కోసం యూఎస్‌కు వెళ్లేవారి సంఖ్య ఏటా పెరుగుతున్నదని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా పేర్కొన్నారు. అత్యధికంగా చైనా నుంచి అమెరికాకు వెళ్తుండగా, రెండో స్థానంలో భారత్ నిలుస్తున్నదని సృష్టం చేశారు. భారత విద్యార్థులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులెట్ జనరల్ కార్యాలయంలో స్టూడెంట్ వీసా డే కార్యక్రమం సందర్భంగా 60 మంది విద్యార్థులకు వీసాలు అందించారు. అమెరికాలో ప్రస్తుతం 1. 8 లక్షలమంది చదువుతున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో సినీనటుడు అడవి శేషు తదితరులు పాల్గొన్నారు.













