తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19 చివరి తేదీ. ఈనెల 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో యథావిధిగా ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.













