ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్
ఈఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేపప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ తెలిపారు. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు ప్రతి ఏడాది మృగశీర కార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వివిధ ప్రాంతాల ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందించామన్నారు. ఈ ఏడాది సైతం కరోనా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి అనుమతి తాత్కాలికంగా నిలిపివేసిందని అన్నారు. ఆస్తమా రోగులు చేపప్రసాదం కోసం హైదరాబాద్కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.













