తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఒక విడత డీఏ చెల్లింపు ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డీఏ పెంచాల్సి ఉంటుందని, ఇవాళ దీనికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఇవాళ పెంచినదాంతో పాటు మొత్తం 27.24 శాతానికి డీఏ పెరిగింది. ఇవాళ 1.52 శాతం డీఏ పెంచారు. దీంతో మొత్తం ఉద్యోగులకు 27.24 శాతం పెరిగింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సీఎం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే పెండింగ్‌లో ఉన్న డీఏ పెంపు ఫైల్‌పై కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై కూడా నిర్ణయం తీసుకునే దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలియవచ్చింది. దీనిపై ఎల్లుండి జరగబోయే కేబినేట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.













