కాంగ్రెస్ లోకి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం

బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఇతర నేతల సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారిద్దరికీ దీపా దాస్‌మున్షీ పార్టీ కండువాలు కల్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దానం నాగేందర్‌కు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు రంజిత్ రెడ్డి రాజీనామా లేఖ పంపారు. బీఆర్‌ఎస్ తరపున చేవేళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశాలు కల్పించినందుకు కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.