రాష్ట్రపతి కోవింద్‌తో ఎంపీ కవిత భేటీ
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీలో పలువురు ప్రముఖులను కలిశారు. రాష్ట్రపతి భవన్లో నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతోనూ కవిత సమావేశమయ్యారు. జగిత్యాలలో బైపాస్ రోడ్లు నిర్మించాలని 4 లైన్లకు విస్తరించాలని ఆయనను కోరారు. నిజామాబాద్-ధర్మపురి రహదారిలో చల్గల్ నుంచి పోలాస మధ్య నిజామాబాద్- కరీంనగర్ రహదారిలో చల్గల్- అంతర్గాన్-దారూర్- రాజారాం మీదుగా బైపాస్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి కవిత విజ్ఞప్తి చేశారు. కవిత ప్రారంభించిన సిస్టర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమానికి సంబంధించిన వెబ్‌లింక్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆవిష్కరించారు.













