తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి.. ఎవరికీ రానీ మెజారిటీ
మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో 21,309 ఓట్లు చెల్లలేదు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,10,964, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,405, తెజస అభ్యర్థి ప్రొ.కోదండరామ్‌కు 70,199 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు అవసరం. ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియ పూర్తియింది. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేస్తున్నారు. ఇందులో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 124, తీన్మార్ మల్లన్నకు 115, ప్రొ.కోదండరామ్‌కు 127 ఎలిమినేషన్ ఓట్లు జమయ్యాయి.













