ఈ నెల 23న పల్లా నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ శానసమండలి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. మూడు పాత జిల్లాలతో కూడిన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ముఖ్యనేతలను, ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను, శ్రేణులను, పట్టభద్రల ఓటర్లు, మిత్రులను తన నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ మేరకు పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు అంతా నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.













